ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్ కార్యాలయ గేటు వద్ద ఓ రైతు కుటుంబం.. ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. జిల్లాలో తగరాలతాండ గ్రామానికి చెందిన బాబు నాయక్... తన భూసమస్య పరిష్కరించాలని అధికారులను కోరారు. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా... అధికారులు పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో.. రామకుప్పం తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబం సభ్యులతో కలిసి ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. తన పేరిట ఉన్న భూమిని వేరొకరి పట్టా ఇచ్చారని బాబూనాయక్ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. తమకు న్యాయం చేయాలని రైతు కుటుంబం... కార్యాలయం ముందు నిరసన తెలిపింది.
ఎమ్మార్వో కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..! - చిత్తూరు రైతు సూసైడ్ న్యూస్
చిత్తూరు జిల్లా రామకుప్పం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఓ రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన భూమికి వేరొకరి పేరుతో పట్టా ఇచ్చారన్న మనస్తాపంతో రైతు.. కుటుంబ సభ్యులతో కలిసి ఉరేసుకునేందుకు యత్నించారు.

farmers suicide attempt at mro office in chittoor
ఎమ్మార్వో కార్యాలయంలో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం..!