CI Misbehaviour In Chitralaout: ఆయన పోలీస్‌శాఖలో ఉన్నతమైన స్థానంలో ఉన్న విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి. పది మందికి న్యాయం చేయాల్సిన తానే.. ఇది తప్పు అని చెప్పిన వారిపైనే కుక్కలను వదిలి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ వద్ద ఉన్న చిత్రా లేఅవుట్లో చోటుచేసుకుంది. ఈ సంఘటనపై అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్లోని చిత్రా లేఅవుట్ అపార్ట్మెంట్లో నగరంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించే సీఐ నివాసం ఉంటున్నారు. అతను రెండు పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. ప్రతి రోజు ఆ పెంపుడు శునకాలను సాయంత్రం పూట వాకింగ్‌కు తీసుకువెళుతూ ఉంటారు. వారం రోజుల క్రితం మంజీర హైట్స్ డీ బ్లాక్‌లో.. కుక్కలను తీసుకుని సీఐ వాకింగ్‌కు వస్తూ ఉండగా.. ఓ మహిళా గైనకాలజిస్ట్ అక్కడ ఏదో పని చేస్తూ ఉన్నారు. సడెన్‌గా ఆ కుక్కలను చూడగానే.. భయాందోళనకు గురయ్యారు.
వాటి వెంట ఆయన వచ్చినా సరే ఆ శునకాలను కనీసం ఏం అనకపోవడం కాదు కదా.. ప్రశ్నించిన ఆమెపైనే దురుసుగా ప్రవర్తించారు. కుక్కలను జాగ్రత్తగా తీసుకొని రండి అని చెప్పినందుకు.. దుర్భాషలాడుతూ ఆమె పైకి వెళ్లారు. వెంటనే అతని వెంట పెంపు శునకం ఆమె దగ్గరకు వెళ్లింది. భయంతో గైనకాలజిస్ట్ కుర్చీని అడ్డు పెట్టుకుంది కాని.. కనీసం ఆ కుక్కను ఏమీ అనలేదు. దాంతో ఆమెకు కోపం వచ్చి ఇదేంటని ప్రశ్నించినందుకు.. కుక్కలను వదిలారు. ఇంకా తనపైకి వెళుతూ సీఐ కోపంతో ఏవో మాటలు ఆడారు. ఈ దృశ్యాలు మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.
అలాగే మరోసారి లిఫ్ట్‌లో కుక్కలను తీసుకొని వెళ్లేందుకు.. లిఫ్ట్ ఎక్కేందుకు ఆగితే అక్కడా కూడా నానా హంగామా చేశాయి. లిఫ్ట్ డోర్స్ ఓపెన్ కాగానే.. వెంటనే ఆ రెండు శునకాలు అందులోకి వెళ్లిపోయాయి. అందులోని ఉన్న వ్యక్తి భయంతో బయటకు వచ్చేశాడు. అక్కడే కుక్కలతో ఉన్న సీఐ కనీసం వాటిని అదుపు చేయలేదు. ఇదేం పని అని ఆ వ్యక్తి ప్రశ్నిస్తే.. బెదిరింపులకు పాల్పడ్డారని లేఅవుట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ భయం భయంగా గడుపుతున్న గెటేడ్ కమ్యూనిటీ వాసులు.. మహిళా డాక్టర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై 509, 506,504 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కుక్కలతో బెదిరింపులతో పాల్పడుతున్న సీఐ.. ఇవీ చదవండి: