సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చిట్‌ఫండ్ కంపెనీ ఘరానా మోసం చేసింది. అల్వాల్‌లోని శ్రీ సంతోషిమాత చిట్‌ఫండ్ కంపెనీ పేరుతో కార్యాలయాన్ని ప్రారంభించిన నిర్వాహకులు.. స్థానికుల నుంచి దాదాపు పది కోట్ల వరకు వసూలు చేశారు. కొన్ని రోజులపాటు చిట్‌ఫండ్ కంపెనీ వ్యాపారం బాగానే సాగినప్పటికీ.. తర్వాత మోసాలు చేయడం మొదలుపెట్టారు.
పదికోట్లకు ఎగనామం పెట్టిన చిట్‌ఫండ్ కంపెనీ - పదికోట్లకు ఎగనామం పెట్టిన చిట్‌ఫండ్ కంపెనీ
చిట్టీల పేరుతో రూ. 10కోట్ల వరకు వసూలు చేసి అనంతరం బోర్డు తిప్పేసిన ఘటన సికింద్రాబాద్‌లోని అల్వాల్‌లో చోటుచేసుకుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
పదికోట్లకు ఎగనామం పెట్టిన చిట్‌ఫండ్ కంపెనీ
బాధితులను నమ్మించి వారి నుంచి పెద్ద ఎత్తున డబ్బులను వసూలు చేసినట్లు బాధితులు ఆరోపించారు. గత కొన్ని రోజుల నుంచి చిట్‌ఫండ్ కంపెనీ ఆఫీసుకు తాళాలు వేసి ఉండడం.. యాజమాన్యాన్ని సంప్రదించినా.. ఎలాంటి సమాచారం లభించలేదు. అనుమానం వచ్చిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సదరు చిట్ ఫండ్ కార్యాలయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి:సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్
TAGGED:
chit fund frauds updates