తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త పురపాలకచట్టంపై గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తాం: లక్ష్మణ్‌ - Bjp State President

సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌కు భాజపా అంటే భయం పట్టుకుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ పేర్కొన్నారు. సభలో తాము లేకున్నా తలుచుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

కొత్త పురపాలక చట్టంపై గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తాం: లక్ష్మణ్‌

By

Published : Sep 24, 2019, 8:39 PM IST

కొత్త పురపాలక చట్టంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వెల్లడించారు. మజ్లిస్‌ కోసమే కొత్త పురపాలక చట్టం తెస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో 8 మంది ఆశావహులు ఉన్నారని వివరించారు. శంకరమ్మ తమను కలవలేదని.. తామూ ఆమెను సంప్రదించలేదని స్పష్టం చేశారు. అభ్యర్థుల పేర్లు స్క్రీనింగ్ చేసి జాతీయ అధ్యక్షుడుకి పంపుతున్నామని లక్ష్మణ్‌ తెలిపారు. ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులను సీఎం కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. హైకోర్టును మారుస్తామని కొత్త మాట చెబుతున్నారన్న లక్ష్మణ్‌.. యజమానులు, కిరాయిదారుల సమస్య వచ్చిదంటే తెరాస ఏం జరుగుతుందోనని ఎద్దేవా చేశారు.

ABOUT THE AUTHOR

...view details