తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2022, 10:01 PM IST

ETV Bharat / state

మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య: చిరంజీవి

బంజారాహిల్స్​లోని డీఏవీ పబ్లిక్​ స్కూల్​ ఘటనపై అన్ని వర్గాల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఘటనపై ట్విటర్​లో మెగాస్టార్​ చిరంజీవి సైతం ట్విటర్​లో స్పందించారు. ఇటీవల జరిగిన ఈ అఘాయిత్యం తనను ఎంతో కలచివేసిందని పేర్కొన్నారు.

Chiranjeevi tweet on Banjara Hills child incident
మెగాస్టార్​ చిరంజీవి

Chiranjeevi tweet on Banjara Hills child incident: బంజారాహిల్స్‌లోని డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ఎల్‌కేజీ చదివే చిన్నారి(4)పై ఇటీవల జరిగిన అఘాయిత్యం ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ప్రముఖ సినీనటుడు చిరంజీవి తెలిపారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ ఈమేరకు మంగళవారం ఆయన ట్విటర్‌ ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు.

"ఆటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠిన శిక్షలు విధించడమే సరైన చర్య. శిక్షలు వేగవంతంగా విధించడంతో పాటు అన్ని విద్యాసంస్థల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి బాధ్యతగా భావిస్తున్నా" అని చిరంజీవి ట్విటర్‌లో పేర్కొన్నారు.

చిన్నారిపై పాఠశాల ప్రిన్సిపాల్‌ కారు డ్రైవర్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఇప్పటికే బంజారాహిల్స్‌ పోలీసులు ప్రిన్సిపల్‌ ఎస్‌.మాధవి, డ్రైవర్‌ రజనీకుమార్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌ గుర్తింపును తక్షణమే రద్దుచేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. అందులోని విద్యార్థులను సమీప పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details