మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘'చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ మరో ముందడుగు' వేసింది. ఇకపై ఈ ట్రస్ట్ సేవలు ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి వచ్చాయి. ఈ మేరకు ట్రస్ట్ వెబ్‌సైట్‌ను సోమవారం ఉదయం చిరు తనయుడు రామ్‌చరణ్ ఆవిష్కరించారు. మరిన్ని ప్రాంతాలకు, మరెంతో మందికి చిరు బ్లడ్, ఐ బ్యాంక్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం కోసమే ఈ వెబ్‌సైట్ ప్రారంభించినట్లు తెలిపారు. దాదాపు 25 భాషల్లో ఇది అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు కొనసాగించడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు.
చిరంజీవి కెరీర్, సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. స్టార్‌గా ఎదిగే క్రమంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెలియజేసేలా వెబ్‌సైట్ www.kchiranjeevi.com ను చరణ్ ప్రారంభించారు. చిరంజీవి జీవితం, ఆయన నటించిన సినిమాలు, పాటలు, దర్శక నిర్మాతలతో ఆయనకున్న సంబంధాలు గురించి ఈ వెబ్‌సైట్‌లో సమాచారం ఉంచామని చరణ్ వివరించారు.
చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ వెబ్‌సైట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా సేవను మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం దొరుకుతుందని.. ప్రతిఒక్కరికీ చిరంజీవి సేవలను దగ్గర చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రామ్‌చరణ్ తెలిపారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చిరంజీవి ట్రస్ట్‌లోని సేవల గురించి, బ్లడ్, ఐ బ్యాంకులోని నిల్వల గురించి తెలుకోవచ్చని.. వెంటనే సాయం పొందవచ్చని రామ్‌చరణ్ వెల్లడించారు. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే.. ఈ సైట్ ద్వారా స్లాట్‌బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎవరికైనా రక్త, నేత్ర దానం కావాలనుకుంటే.. చిన్న రిక్వెస్ట్ పెడితే మేం వెంటనే రెస్పాండ్ అవుతామన్నారు. ప్రస్తుతం బ్లడ్, ఐ బ్యాంకులను మాత్రమే నిర్వహిస్తున్నాం. త్వరలోనే మిగిలిన అన్ని ఆర్గాన్స్‌కి ప్రత్యేక బ్యాంక్స్ నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు.
'నాన్న నట వారసత్వాన్నే కాదు సేవా తత్వాన్ని కూడా తీసుకుంటున్నాను. చిన్నచిన్న అడుగులతో నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తాను. మరో 30 ఏళ్లపాటు నా ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకు సేవలు కొనసాగుతాయి. రెండో దశలో బ్లడ్‌బ్యాంకు కోసం ప్రత్యేక యాప్ తయారు చేయాలనే ఆలోచన ఉంది. నాన్న, నా సినిమా పారితోషకాలతోనే ఈ బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు కొనసాగుతోంది. మరింత మందికి సాయం అందుతుందంటే దాతల నుంచీ విరాళాలు సేకరిస్తాం. ఆ వివరాలు సహా ట్రస్టులో పూర్తిస్థాయి నియామకాలను నాన్న త్వరలో ప్రకటిస్తారు.'
- రామ్‌చరణ్
ఇదీచూడండి:ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ రాజీనామాలు అందలేదు: విష్ణు