చింతల్ డివిజన్లో సమస్యల పరిష్కారానికి భాజపాను గెలిపించాలని అభ్యర్థి పత్తి శ్రుతి ఓటర్లను కోరారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు గ్రేటర్ ఎన్నికల్లో విద్యావంతులకు అవకాశం ఇవ్వాలని అన్నారు.
'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం' - గ్రేటర్ ఎన్నికలు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విద్యావంతులను గెలిపించాలంటూ చింతల్ 128 డివిజన్ భాజపా అభ్యర్థి పత్తి శ్రుతి విజ్ఞప్తి చేశారు. తనను గెలిపిస్తే ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
!['విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం' CHintal BJP candidates sruthi election compaign ghmc](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9628307-729-9628307-1606052934611.jpg)
'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం'
'విద్యావంతులకు ఓటేస్తేనే అభివృద్ధి సాధ్యం'
డివిజన్ పరిధిలో కొంతమంది ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు దండుకుంటున్నారని ఆమె ఆరోపించారు. భాజపాను గెలిపిస్తే అనేక కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తీరుస్తానని శ్రుతి హామీ ఇచ్చారు.