Chinna Jeeyar Swamy at Hospital : ఆరోగ్యం.. ఆహారం.. లేకుండా జీవితమే లేదని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి పేర్కొన్నారు. డి.గంగాధర్ గుప్తా ఆధ్వర్యంలో హైదరాబాద్ రామ్ నగర్లో కొనసాగుతున్న సీజీ ఛారిటీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ వైద్య సేవలు ప్రారంభించారు.
ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్.. ప్రారంభించిన చిన్నజీయర్ - one rupee consultation
Chinna Jeeyar Swamy at Hospital : ఇటీవల కాలంలో వైద్యం చాలా ప్రియంగా మారిన తరుణంలో రామ్‌నగర్‌లో ఒక్క రూపాయి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చిన్న జీయర్ స్వామి ఆస్పత్రిని సందర్శించారు. అతి తక్కువ ధరకు వైద్య సేవలందించడాన్ని ఆయన అభినందించారు.

ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్
పేద, ధనిక, కుల, మత భేదం లేకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు... అతి తక్కువ ధరలో వైద్యాన్ని అందించడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా... చిన్నజీయర్ స్వామికి ఆస్పత్రి నిర్వాహకులు పాదపూజ చేశారు. ఈ కార్యక్రమంలో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ దామోదర్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:'రూ.225 కోట్ల ఆస్తులిస్తాం... మేకపాటి గౌతంరెడ్డి వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు చేయండి'