తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉక్రెయిన్ వధువు వెడ్స్ హైదరాబాదీ వరుడు.. ఫొటోలు వైరల్ - తెలంగాణ వార్తలు

Hyderabad man weds Ukraine bride : రష్యా, ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రష్యా దురాక్రమణను చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఐదో రోజూ రష్యా దూసుకొస్తుండగా.. ఉక్రెయిన్‌ ఎదురొడ్డి నిలుస్తోంది. అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం చొరవచూపి కొందరిని స్వదేశానికి తీసుకొచ్చింది. కాగా ఇంకా కొంతమంది అక్కడే చిక్కుకున్నారు. అయితే ఈ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ వధువుతో హైదరాబాదీ వివాహం జరిగింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్​గా మారాయి.

Hyderabad man weds Ukraine bride
ఉక్రెయిన్ వధువు వెడ్స్ హైదరాబాదీ వరుడు.. ఫొటోలు వైరల్

By

Published : Feb 28, 2022, 8:51 PM IST

ఉక్రెయిన్​కు చెందిన యువతి ల్యూబోవ్... హైదరాబాద్​కు చెందిన ప్రతీక్ గతకొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే ఈ జంట ఇటీవలె ఆ దేశంలో పెళ్లి చేసుకున్నారు. రిసెప్షన్​ను హైదరాబాద్​లో జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. అయితే వీరి పెళ్లి యుద్ధం ప్రారంభం కావడానికి ముందే జరిగింది. వివాహం తర్వాత ఇండియాకు వచ్చిన ఈ కొత్త జంట... ఆదివారం రాత్రి హైదరాబాద్​లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకను జరుపుకున్నారు.

నూతన వధూవరులకు రంగరాజన్ ఆశీర్వాదం

ఈ రిసెప్షన్​కు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. వెంకటేశ్వర స్వామివారి శేష మాల, శేష వస్త్రం అందించి... ఆశీర్వచనం చేశారు. అనంతరం ఉక్రెయిన్-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం త్వరలో ముగియాలని ఆకాంక్షించారు. అందుకోసం ఆలయంలో సోమవారం ఉదయం ప్రత్యేక పూజలు చేసినట్లు వెల్లడించారు.

ఫొటోలు వైరల్

ఈ రిసెప్షన్​కు ఆయన రావడానికి ఓ కారణం ఉంది. వరుడి తండ్రి ఉస్మానియా యూనివర్సిటీ బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో అర్చకులు రంగరాజన్ స్వామితో కలిసి చదువుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఉక్రెయిన్ వధువు, హైదరాబాదీ వరుడి రిసెప్షన్​కు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఈవెంట్​కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఉక్రెయిన్ వధువు వెడ్స్ హైదరాబాదీ వరుడు.. ఫొటోలు వైరల్

ఇదీ చదవండి:రష్యా- ఉక్రెయిన్​ కీలక చర్చలు- సంధి కుదిరేనా?

ABOUT THE AUTHOR

...view details