తెలంగాణ

telangana

ETV Bharat / state

Seedless Fruits: వాహ్వా అనిపిస్తున్న విత్తనాలులేని బత్తాయి, సీతాఫలం - TELUGU NEWS

Seedless Fruits in AP: మనం సీతాఫలం, బత్తాయి తింటున్నప్పుడు అడ్డుగా గింజలు తగులుతుంటాయి. అబ్బా ఇవి లేకపోతే ఎంత బాగుండు అనుకుంటాం. అలాగే అనుకున్నాడో ఏమో విత్తనాల్లేని పండ్లను పండిస్తూ.. వాహ్వా అనిపిస్తున్నాడు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చిలుకూరి నరేష్.

Seedless Fruits in AP
విత్తనాల్లేని సీతాఫలం

By

Published : Jan 1, 2022, 2:15 PM IST

Seedless Fruits in AP: సాధారణంగా బత్తాయి, సీతాఫలాల్లో మనకు విత్తనాలు కనిపిస్తాయి. కానీ కాయల్లో విత్తనాలే లేని ఆ రకాల వంగడాలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియపులంకలోని నర్సరీ నిర్వాహకులు చిలుకూరి నరేష్‌. ఆయన థాయ్‌లాండ్‌ తదితర ప్రాంతాల నుంచి ఈ రకం మొక్కలను తెప్పించి అంట్లు కట్టి వాటి సంఖ్యను పెంచారు. ప్రస్తుతం అవి కాయలు కాస్తున్నాయి.

దీనిపై ప్రాంతీయ ఉద్యానశాఖాధికారి సుధీర్‌ మాట్లాడుతూ... విత్తనాలు లేని ఈ కాయలను తిరుపతిలోని చీనిబత్తాయి పరిశోధన కేంద్రం వారు పరిశీలిస్తారని చెప్పారు. ఆ పండ్లలోని షుగర్‌ లెవెల్స్‌, పోషకాలు, మినరల్స్‌ ఎంత మోతాదులో ఉన్నాయో వారు పరీక్షించి చెబుతారని వెల్లడించారు.

ఇదీ చూడండి:New year drunk and drive cases : ఒక్కరోజే.. హైదరాబాద్‌లో భారీగా డ్రంక్​ అండ్​ డ్రైవ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details