తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొవిడ్​ టీకాలను భద్రపరిచేందుకు మార్కెట్లోకి 'చిల్లర్​ మిల్​'' - jayesh ranjan starded chiller mill news

కొవిడ్ టీకాలను భద్రపరిచేందుకు వీలుగా రాక్​వెల్ సంస్థ ఫ్రీజర్​ను రూపొందించింది. చిల్లర్​ మిల్​ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్రీజర్​లను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్ ప్రారంభించారు.

Chiller Mill on the market to store Kovid vaccines
'కొవిడ్​ టీకాలను భద్రపరిచేందుకు మార్కెట్లోకి 'చిల్లర్​ మిల్​''

By

Published : Mar 4, 2021, 2:11 PM IST

ప్రముఖ కూలింగ్ ఉత్పత్తుల సంస్థ రాక్​వెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కొవిడ్ వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం సోలార్, విండ్ పవర్​తో పనిచేసే ఫ్రీజర్​ను మార్కెట్​లోకి విడుదల చేసింది. చిల్లర్ మిల్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్రీజర్​లను ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్ ప్రారంభించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైన కొవిడ్ టీకాలను భద్రపరిచేందుకు వీలుగా ఈ ఫ్రీజర్​లను రూపొందించినట్లు ఆ సంస్థ ఎం.డి. అశోక్​ గుప్తా పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ చిల్లర్​మిల్​లకు డబ్ల్యూహెచ్​వో పీక్యూఎస్​ సర్టిఫికేషన్​తో పాటు నైపర్ నుంచి అనుమతులు లభించటం గర్వించే విషయమన్నారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఫ్రీజర్​లు వ్యాక్సిన్​ను అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద భద్రపరిచే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు నిరంతరంగా సోలార్, విండ్ పవర్​తో పనిచేస్తాయని వివరించారు.

కార్యక్రమంలో అశోక్​ గుప్తాతో పాటు సంస్థ డైరెక్టర్ ప్రతీక్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించిన కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details