అహోబిలం పీఠాధిపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అహోబిలం ఆలయ ఈవో మల్లిఖార్జున ప్రసాద్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్.
అహోబిలం ఆలయ ఈవో వ్యాఖ్యలపై మండిపడ్డ రంగరాజన్ - అహోబిలం పీఠాధిపతి
అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి ఆలయ ఈవో మల్లిఖార్జున ప్రసాద్‌పై చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ మండిపడ్డిడారు. మాండ్ చేశారు. అహోబిలం పీఠాధిపతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు 24 గంటల్లో క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అహోబిలం ఆలయ ఈవో వ్యాఖ్యలపై మండిపడ్డ రంగరాజన్
పీఠాధిపతిపై మల్లిఖార్జున్ వ్యాఖ్యలు అహోబిలం పీఠం శిష్యులను ఆగ్రహానికి గురి చేశాయని ఆయన తెలిపారు. మఠం వేరు.. ఆలయం వేరు అని మల్లిఖార్జున్ వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆలయ ఈవోగా మల్లిఖార్జున్ తనకు తానే ప్రకటించుకున్నారని రంగరాజన్ ఆరోపించారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పాజిటివ్