తెలంగాణ

telangana

ETV Bharat / state

'చదువును బాహటంగా అమ్మకానికి పెట్టారు'

కరోనా పుణ్యమా అంటూ.. ఆన్​లైన్​ తరగతులను అడ్డు పెట్టుకొని చదువును బాహటంగా అమ్మకానికి పెట్టేశారని బాలల పరిరక్షణ వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. లాక్​డౌన్​ కారణంగా ఎంతోమంది పిల్లలు స్నేహితులను కలవలేక.. ఆడుకోలేక.. ఆన్​లైన్​ క్లాసుల కోసం అధిక ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

childrens rights organisation about online classes
చదువును బాహటంగా అమ్మకానికి పెట్టారు : బాలల హక్కుల పరిరక్షణ వేదిక

By

Published : Sep 25, 2020, 10:52 PM IST

కొవిడ్​-19 వల్ల పిల్లల చదువును బహిరంగంగా అమ్మకానికి పెట్టి.. వారి తల్లిదండ్రులను ఫీజుల కోసం వేధిస్తున్నారని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆవేదన వ్యక్తం చేసింది. లాక్​డౌన్​ వల్ల పిల్లలు ఇంట్లోనే ఉంటూ.. మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని.. బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ భార్గవి అన్నారు.

ఆన్‌లైన్‌ తరగతులు ఆర్థం గాక, వచ్చిన సందేశాల్ని నివృత్తి చేసుకోలేక పిల్లలు కుంగిపోతున్నారన్నారు. పాఠశాలలు బంద్‌ కావడం వల్ల బడుగు వర్గాలకు చెందిన పిల్లలకు కనీసం ఒక్కపూట కూడా పౌష్టికాహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక తయారు చేసిన ఇచ్చినట్లు ఆమె తెలిపారు.

ఇదీ చూడండి:'వ్యవసాయ పంటల సాగు సరళి మారాల్సిన అవసరం ఉంది'

ABOUT THE AUTHOR

...view details