ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిన్నారులు చంద్రాయన గుట్టకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. యాచకులుగా మారారు. చైల్డ్‌లైన్ అధికారులు వారిని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆశ్రిత అనాథాశ్రమానికి తరలించారు.
అశ్రిత అనాథాశ్రమంలో చిన్నారుల అదృశ్యం - సికింద్రాబాద్‌లోని ఆశ్రిత అనాధాశ్రమం నుండి ఇద్దరు పిల్లలు అదృశ్యం
అనాథాశ్రమంలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. వారిని చైల్డ్‌లైన్ వారు అక్కడ చేర్చారు. రెండురోజుల్లోనే వారు కనిపించకుండా పోవడం కలకలం రేపింది.
ఆశ్రిత అనాధాశ్రమం నుండి ఇద్దరు పిల్లలు అదృశ్యం
రెండురోజుల పాటు అనాథాశ్రమంలో ఉన్న పిల్లలు ఉదయం తమ బ్యాగులను తీసుకుని ఆశ్రమం నుండి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఆశ్రమంలో ఉండడం ఇష్టం లేకనే ఈ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనాథాశ్రమం నిర్వాహకుడు మహేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లలు ఎక్కడికి వెళ్లారు అనే కోణంలో సీసీ పుటేజ్ ద్వారా పరిశీలిస్తున్నారు.