చైల్డ్ హోమ్ నుంచి ముగ్గురు పిల్లలు అదృశ్యమైన సంఘటన సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దిల్‌సుఖ్‌నగర్‌లో ఉన్న ప్రేరణ చైల్డ్ హోమ్ నుంచి ముగ్గురు అనాథ పిల్లలు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. చైల్డ్ హోమ్‌లో 27 మంది పిల్లలు ఉంటున్నట్లు లాక్డౌన్ నేపథ్యంలో 24 మంది విద్యార్థులు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. నాగేంద్ర, రాజా, సన్నీ అనే ముగ్గురు పిల్లలు మాత్రం తల్లిదండ్రులు లేకపోవడం వల్ల హోమ్ లోనే ఉన్నారని తెలిపారు. ప్రేరణ చైల్డ్ హోమ్‌లో మధ్యాహ్నం నుంచి ముగ్గురు పిల్లలు కనిపించకపోవడం వల్ల వార్డెన్ వేణుగోపాలరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు.
బోయిన్పల్లి పీఎస్ పరిధిలో ముగ్గురు పిల్లలు అదృశ్యం - childrens missing
చైల్డ్‌హోమ్ నుంచి ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయిన సంఘటన బోయిన్పల్లి పీఎస్ పరిధిలోని దిల్‌కుష్‌నగర్‌లో జరిగింది. మధ్యాహ్నం నుంచి ముగ్గురు పిల్లలు కనిపించకపోవడం వల్ల వార్డెన్ వేణుగోపాలరెడ్డి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
బోయిన్పల్లి పీఎస్ పరిధిలో ముగ్గురు పిల్లలు అదృశ్యం
వెంటనే పోలీసులు స్పందించి చైల్డ్ హోమ్‌కు చేరుకొని అక్కడ సీసీ ఫుటేజీలను పరిశీలించారు. పిల్లలు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయిన విషయాన్ని వార్డెన్ పోలీసులకు తెలుపగా... సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పిల్లలు ఎక్కడికి వెళ్లారు.. అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: గొడ్డళ్లు, రాళ్లతో ఇంటిపై దాడి... పలువురికి గాయాలు