పిల్లలు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని.. సత్తాగల రంగాల్లో ప్రతిభ చాటాలని విద్యార్థులకు గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు. విద్యతోపాటు నచ్చిన రంగంలో అభిరుచి, ఆసక్తి ఏర్పరుచుకుని రాణించాలని చెప్పారు. అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలోని ఓ కల్చరల్ ఫెస్ట్‌కు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపై ఉందన్నారు. విద్యార్థులకు చిన్న వయసు నుంచే ఆ దిశగా దిశానిర్దేశం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి.
పిల్లలకు నచ్చిన రంగాల్లో ప్రోత్సహించండి: గవర్నర్
హైదరాబాద్ అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరయ్యారు.
విద్యార్థులకు చిన్న వయసు నుంచే దిశానిర్దేశం చేయాలి : గవర్నర్