జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకుని సమష్టి ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు లఘు చిత్రం రూపొందించారు. పిల్లలే రచయితలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా వ్యవహరించడం ప్రత్యేకం. చిన్నారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు రూపొందించిన ఈ లఘు చిత్రాన్ని చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు పంపనున్నట్లు ఉపాధ్యాయురాలు శ్వేతా మహంతే హైదరాబాద్‌లో పేర్కొన్నారు.
పిల్లలే రచయితలు, దర్శకులుగా లఘు చిత్రం - పిల్లలే రచయితలుగా, దర్శకులుగా, నిర్మాతలుగా వ్యవహరించడం ప్రత్యేకం
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ప్రతి ఏటా నవంబర్ 14న జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ నేపథ్యంలో సమష్టి ఇంటర్నేషనల్ పాఠశాల ఆధ్వర్యంలో వినూత్నంగా విద్యార్థులు లఘు చిత్రం రూపొందించారు.
![పిల్లలే రచయితలు, దర్శకులుగా లఘు చిత్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5056669-974-5056669-1573680405391.jpg)
ఆరు నుంచి 16 ఏళ్ల వయసు పిల్లలను తీసుకుని అవగాహన కల్పించినట్లు ఆమె తెలిపారు. ఒక్కో అంశాన్ని తీసుకుని దానిపై కథనం రూపంలో యాంకరింగ్ ,వాయిస్ ఓవర్‌తో అంశానికి తగినట్టు చేశారు. పిల్లల్లో అంతర్గతంగా దాగి ఉన్న నటనా కౌశల్యాన్ని, దర్శకత్వ, ప్రతిభకు కథలు రాయడం, వార్తలను చదవడం వీడియో చిత్రీకరణ, తదితర మీడియాకు సంబంధించిన విశేషాలను తెలియజేసినట్లు శ్వేతా మహంతే తెలిపారు. ఆయా అంశాల్లో చిన్నారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించినట్లు ఆమె వివరించారు.
ఇదీ చూడండి : 'రాయాల్సింది సూసైడ్‌నోట్ కాదు... తెరాసకు మరణ శాసనం'