తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రేమకు నిదర్శనం.. కొడుకులందరికీ భాషా ఆదర్శం - vijayawada news

కష్టమొచ్చిందని ఏ తల్లీ బిడ్డను వదిలేయదు. డబ్బుల్లేవని ఏ అమ్మా పిల్లల్ని వదిలించుకోదు. ఎంత పేదరికంలో ఉన్నా కడుపు నింపుతుంది. కంటికి రెప్పలా కాచుకుంటుంది. మరి అలాంటి తల్లి రుణం తీర్చుకొనేదెలా... ఇదిగో ఈ ఇద్దరు బిడ్డల్ని అడగండి చెబుతారు.

children-who-love-the-mother-no-matter-how-hard-it-comes
అమ్మకు నాన్నై అన్నం పెట్టే...

By

Published : May 4, 2020, 9:57 AM IST

ఆంధ్రప్రదేశ్​ విజయవాడకు చెందిన బాషా 15 ఏళ్లుగా తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఈయన భార్య చనిపోయింది. పిల్లలు వదిలేశారు. తానుమాత్రం తల్లిని దైవంలా భావించి సపర్యలు చేస్తున్నారు. వాచ్‌మన్‌గా కొన్నాళ్లు పని చేసి, వయసు మీదపడడంతో పని మానేశారు. అద్దె ఇంట్లో ఉండే ఇతను ప్రస్తుతం డబ్బు లేక రోడ్డుపైనే తల్లితో కష్టంగా బతుకీడుస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో తిండి లేక కష్టాలు పడుతున్నాడు. రోజూ విజయవాడ ఆటోనగర్‌ నుంచి బెంజ్‌సర్కిల్‌కు తల్లిని ట్రైసైకిల్‌పై తీసుకొచ్చి అన్నం అర్థిస్తున్నారు.

విజయవాడ కృష్ణలంకకు చెందిన రాజాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం ముందున్న బస్‌ షెల్టర్లో తల్లితో పాటుగా ఉంటున్నారు. భార్య వదలివెళ్లినా తల్లిని మాత్రం దూరం చేసుకోలేదు. అనారోగ్యంలో తల్లికి అండగా ఉండి.. గొంతు ఆపరేషన్‌ చేయించారు. కూలి పని చేసుకునే ఆయనకు లాక్‌డౌన్‌ వేళ పనిలేదు. ఇలా బస్‌షెల్టర్లో ఉంటూ దాతలిచ్చిన ఆహారమే ఆధారంగా అమ్మను చూసుకుంటున్నారు. కంటికిపాపలా చూసుకున్న తల్లిని కంటికిరెప్పలా కాచుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details