Children should get what they want immediately: చిన్నారులకు కోరింది వెంటనే చేతికి రావాలనే మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఇచ్చేవరకు పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అన్నట్లు అసహనాన్ని ప్రదర్శిస్తారు. అనుకున్నది దొరకనప్పుడు కోపమెక్కువై దాన్ని ఎదుటి వారిపై చూపించే ప్రమాదం ఉంది. లేదంటే నిరాశలోకి జారిపోతారు. కొన్నిసార్లు కోరింది చేతికందనప్పుడు వారి కోపం దుఃఖంగా మారుతుంది. స్వీయనియంత్రణ కోల్పోతారు. ఎవరేం చెప్పినా వినరు. చిన్నప్పుడే ఈ లక్షణాల్ని నియంత్రించగలగాలి. లేదంటే అది వారితో పాటు పెరిగి పెద్దదవుతుంది.
క్రీడలు:పిల్లలను క్రీడల్లో ప్రవేశపెడితే ఓటమి, తిరిగి గెలవడానికి ప్రయత్నించడం, ఏకాగ్రత, పట్టుదల వంటివి అలవడతాయి. ఈ నైపుణ్యాలన్నీ వారిలో కావాల్సింది వెంటనే దొరకనప్పుడు అసహనాన్ని తెచ్చుకోకుండా శాంతంగా ఆలోచించడాన్ని నేర్పుతాయి. అందరిలో తామూ ఒకరమనే భావన అలవాటవుతుంది. బృందంతో కలిసి ఆడటం, తన ఆలోచనను ఎదుటివారితో పంచుకోవడం నేర్చుకుంటారు. ఏది సరైనదో తెలుసుకొనే అవగాహన పెరుగుతుంది.