తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు - Children Day Celebrations latest news

Children Day celebrations in Telangana: రాష్ట్ర వ్యాప్తంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు పంచిపెట్టారు. పలుచోట్ల మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Children Day celebrations in Telangana
Children Day celebrations in Telangana

By

Published : Nov 14, 2022, 9:12 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Children Day celebrations in Telangana: బాలల దినోత్సవాన్నిపురస్కరించుకొని హైదరాబాద్ కవాడిగూడలో మాధవ ఆటిజం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంకేతిక సేవల సంస్థ ఛైర్మన్ జగన్​మోహన్ రావు హాజరయ్యారు. సికింద్రాబాద్‌ కార్ఖానాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో నెహ్రూ చిత్రపటానికి గీతారెడ్డి నివాళులర్పించారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో బాలల దినోత్సవాన్ని పలు రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించాయి.

పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జవహర్​లాల్ నెహ్రూ చిత్రపటానికి శ్రీధర్‌బాబు పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదిలాబాద్‌లో శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అదనపు పాలనాధికారి రిజ్వాన్‌.. జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. నిర్మల్‌లోని వాసవి పాఠశాలలో బాలల దినోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి.

ABOUT THE AUTHOR

...view details