బాలల హక్కులను కాపాడేందుకు రాష్ట్ర కమిషన్‌తో సమన్వయం చేసుకుంటామని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞ పరాండే తెలిపారు. బాల కార్మికులు, బాల నేరస్థుల చట్టం అనే అంశాలపై హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలకు చెందిన బాలల పరిరక్షణ అధికారులకు చట్టాల అమలుపై అవగాహన కల్పించారు.
'బాలల పరిరక్షణపై అధికారుల మధ్య సమన్వయం అవసరం' - 'బాలల పరిరక్షణపై అధికారుల మద్య సమన్వయం అవసరం
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల బాలల పరిరక్షణ అధికారులకు చట్టాల అమలుపై అవగాహన సదస్సు జరిగింది. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు హాజరయ్యారు.
'బాలల పరిరక్షణపై అధికారుల మద్య సమన్వయం అవసరం'
ఇప్పటి వరకు 10 రాష్ట్రాల్లో పర్యటించి అవగాహన సదస్సులు నిర్వహించినట్లు ప్రజ్ఞ తెలిపారు. బాల నేరస్థుల విషయంలో సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఇవీచూడండి: రేపు యాదాద్రికి ముఖ్యమంత్రి కేసీఆర్