పండుగ సందర్భంగా తల్లిదండ్రులు బట్టలు కొనివ్వలేదని ఓ బాలిక ఇల్లు వదిలి వెళ్లిన ఘటన ఆంధ్రప్రదేశ్ అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసులు ఈ కేసును 2 గంటల్లోనే ఛేదించారు. గుంతకల్లు పట్టణానికి చెందిన పదేళ్ల బాలిక మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బయటకు వెళ్లిపోయింది. ఇంటికొచ్చిన తల్లి.. బాలిక కోసం చుట్టు పక్కల అంతా గాలించింది. ఆచూకీ లభించకపోవడంతో స్థానికుల సహాయంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ ఉమామహేశ్వర రెడ్డికి సమాచారం అందించారు. డీఎస్పీ నేతృత్వంలో పోలీసులు చుట్టుపక్కల స్టేషన్లకు సమాచారం అందించారు. 8 బృందాలుగా విడిపోయి పట్టణం అంతా గాలించారు. 2 గంటల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్నారు. గుంతకల్లులోని చర్చి వద్ద బాలిక ఆచూకీ లభ్యమైంది.
పాపకు కొత్త బట్టలు