child died On hit by school bus At Bachupally : స్కూల్ బ్యాగ్‌ను వీపున ధరించి.. అమ్మ ఇచ్చిన లంచ్ బాక్సు తీసుకొని ముసిముసి నవ్వులతో ఆ చిన్నారి తల్లికి బాయ్ చెప్పింది. నాన్నతో కలిసి బుడిబుడి అడుగులతో స్కూల్‌కి బయళ్దేరింది. నాన్న చెప్పే కబుర్లును వింటూ ఈ స్కూటీపై ఎంచక్కా స్కూల్‌కు వెళ్తోంది. మరికొద్ది నిమిషాల్లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకోవాల్సి ఆ చిన్నారిని ఇంతలో ఓ స్కూల్ బస్సు మృత్యువు రూపంలో పలకరించింది. ఓ డ్రైవర్ నిర్లక్ష్యంతో ఆ చిన్నారి పసి హృదయం బస్సు చక్రాల కింద నలిగిపోయింది.
తన కళ్ల ముందు తన గారాల పట్టి బస్సు చక్రాల కింద నలిగిపోవడం చూసి ఆ కన్న తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ప్రమాదంలో తన చేతిని కోల్పోయినా సరై తన కుమార్తెను పట్టుకొని ఆ తండ్రి విలపించిన తీరు చూపరులను కంట తడిపెట్టించింది. అప్పుడే తనను అప్యాయంగా కౌగిలించుకొని ఇంటి నుంచి వెళ్లిన తమ కుమార్తె మృత్యువాత పడటంతో ఆ తల్లిని ఓదార్చడం అక్కడున్న వారి తరం కాలేదు. ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించగా.. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
- Telangana Road accidents today : రక్తమోడిన రహదారులు.. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ముగ్గురి ప్రాణాలు బలి
- Warangal Car Accident Today : విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి.. జనావాసాల్లోకి దూసుకెళ్లి.. వరంగల్ జిల్లాలో కారు బీభత్సం
హైదరాబాద్‌లోని బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్స్ కంపెనీ వద్ద కిశోర్ అనే వ్యక్తి తన కుమార్తెను పాఠశాలకు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తున్నాడు. రోడ్లు గుంతలుగా మారడంతో బైక్ స్కిడ్ అయ్యి తండ్రి, కుమార్తె ఇద్దరూ కింద పడిపోయారు. ఇంతలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఏ స్కూల్ బస్సు చిన్నారి దీక్షతపై నుంచి వెళ్లిపోయింది. దీంతో బస్సు చక్రాల కింద నలిగి చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.