అబిడ్స్‌లోని ఓ థియేటర్ పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం పవన్ కుమార్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాడు. విశ్రాంతి సమయంలో కుమారుడు దత్తు మొదటి అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందాడు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బాలుడి తండ్రి పవన్ కుమార్ అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
థియేటర్ పైఅంతస్తు నుంచి పడి బాలుడి మృతి - child dead in theatre
హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదవశాత్తు థియేటర్‌పై అంతస్తు నుంచి జారిపడి మూడేళ్ల బాలుడు మృతి చెందాడు.
థియేటర్ పైఅంతస్తు నుంచి పడి బాలుడి మృతి