సికింద్రాబాద్కు చెందిన హాజిరా కుమార్తె ఫాతిమకు జ్వరం రావడం వల్ల ఆస్పత్రిలో చూపించడానికి బస్సు ఎక్కి ప్యాట్నీ దగ్గర దిగారు. అక్కడ నుంచి జేమ్స్ స్ట్రీట్కు నడుచుకుంటూ వెళ్లారు. వారికి కాగితాలు ఏరుకునే వ్యక్తి పరిచయం అయ్యాడు. నల్లగుట్ట ట్రాన్స్ పోర్ట్ వద్దకు రాగానే పాపకు పాలు తీసుకురావడానికి హాజిరా అక్కడ నుంచి వెళ్లింది. వచ్చి చూసేసారికి ఫాతిమతో పాటు కాగితాలు ఏరుకునే వ్యక్తి కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సికింద్రాబాద్ నల్లగుట్టలో కిడ్నాప్ కలకలం - kidnap
సికింద్రాబాద్ నల్లగుట్టలో ఐదేళ్ల పాప అపహరణకు గురైంది. తమ పాపను చెత్త ఏరుకునే వ్యక్తి అపహరించినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఫాతిమ