తెలంగాణ

telangana

ETV Bharat / state

'క్యాసినో విషయంలో నాపై తప్పుడు ఆరోపణలు.. అందరి పేర్లు బయటపెడతా' - AP cashino history

క్యాసినో విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. తన వద్ద వివరాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మను చీకోటి దర్శించుకున్నారు.

Chikoti Praveen
చికోటి ప్రవీణ్​

By

Published : Jan 13, 2023, 7:50 PM IST

క్యాసినో విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చీకోటి ప్రవీణ్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్​లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ సందర్బంగా ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు. కోడి పందేలు ఆడేందుకు వచ్చానని చెప్పారు. ఈ క్రమంలోనే క్యాసినో విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, ఈడీ విచారణ జరుగుతోందని అన్నారు. తన దగ్గర వివరాలు ఉన్నాయని, సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయటపెడతానని హెచ్చరించారు. హిందూ మతం, హిందూ దేవుళ్లపై అసత్యాలు, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారికి బుద్ధి వచ్చేటట్టు చేయమని అమ్మవారిని వేడుకున్నానని తెలిపారు. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అమ్మవారి సన్నిధిలో చికోటి ప్రవీణ్​

క్యాసినో కథేంటంటే..:గుడివాడలోగోవా తరహాలో క్యాసినో నిర్వహించి నల్లధనాన్ని పోగేసుకున్నట్లు పలువురు వ్యక్తులపై గతేడాది ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై టీడీపీ నాయకులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పేరుకు ఎడ్ల పందేలు పెడుతున్నామని.. వెనక క్యాసినో నడిపారని టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్నామని చీకోటి ప్రవీణ్​ ప్రచారం చేసిన ఆధారాలను ఐటీ అధికారులకు అందించామని ఆయన వెల్లడించారు. చీకోటి ప్రవీణ్ తనకు స్నేహితుడేనని వంశీ స్వయంగా చెప్పారని ఆరోపించారు.

ఈ వ్యవహరంలోకి కొడాలి నాని వేలాది మందిని రప్పించారని మండిపడ్డారు. వేలకు వేలు ఎంట్రీ ఫీజులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ క్యాసినోలో దాదాపు రూ.500 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు జరిగాయని అన్నారు. హవాలా రూపంలో ఆ నగదును దారి మళ్లించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. హవాలా సొమ్మును దారి మళ్లించేందుకు చీకోటి సాయపడ్డారని.. దీనిలో ఎంత మొత్తం చేతులు మారాయనేది తమ వద్దనున్న వివరాలను ఐటీకి ఇచ్చామని తెలిపారు. అందుకే కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

దీంతో చీకోటి ప్రవీణ్​ను ఈడీ అధికారులు 4 రోజుల పాటు విచారించారు. తన దగ్గర నుంచి కీలక ఆధారాలు సేకరించారు. చీకోటి ప్రవీణ్‌తో పాటు అతని బంధువుల బ్యాంకు ఖాతాల వివరాలూ సేకరించారు. ప్రవీణ్‌తో పాటు అతని కుటుంబసభ్యులు.. డైరెక్టర్లు, భాగస్వాములుగా ఉన్న కంపెనీల వివరాలపై అతడిని ఈడీ ప్రశ్నించింది.

విచారణలో తనకు ఎలాంటి కంపెనీలు లేవని.. చీకోటి ప్రవీణ్ ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. బ్యాంకు లావాదేవీలతో పాటు.. స్థిర చరాస్తుల వివరాలు ఈడీ అధికారులు సేకరించారు. వీటితో పాటు.. అతని పాస్ పోర్ట్ వివరాలు తీసుకున్న ఈడీ ఆధికారులు.. సేకరించిన వివరాలను విశ్లేషిస్తున్నారు. ఈరోజు ఈడీ విచారణ గురించి అడగగా ఇంకా విచారణ జరుగుతుందని చీకోటి బదులిచ్చారు. తనకు అనుకూలంగా రావాలని అమ్మవారిని కోరుకుంటున్నట్టు చెప్పారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details