తెలంగాణ

telangana

CS: జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

By

Published : Jun 10, 2021, 10:29 PM IST

జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్​ అధికారులకు సూచించారు. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి దక్కేలా చూడాలని తెలిపారు.

cs somesh kumar
జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలి

జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఐటీ, పంచాయతీరాజ్, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, సాంకేతికవిద్య, పరిశ్రమల శాఖ అధికారులు, వీహబ్ సీఈవో, ఫుడ్ ప్రాసెసింగ్ సంచాలకులతో బీఆర్కే భవన్​లో సీఎస్ సమీక్ష నిర్వహించారు.

ఆయా శాఖలు అమలు చేస్తున్న జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. కార్యక్రమాలను మరింత పటిష్టంగా అమలు చేసి వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి దక్కేలా చూడాలని సోమేశ్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి: Guidelines: ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు

ABOUT THE AUTHOR

...view details