CS Somesh Kumar: సరళతర వాణిజ్య విధానంలో అగ్రస్థానం కొనసాగడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆయా శాఖల్లో సంబంధిత ప్రక్రియలన్నింటినీ సులభతరం చేయాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. వాణిజ్యపన్నులు, ఎక్సైజ్, పౌరసరఫరాలు, రవాణా, ఇంధన, హోం, పురపాలక, కార్మిక శాఖల కార్యదర్శులు, అధికారులతో సమావేశమైన సీఎస్... సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు.
CS Somesh Kumar: ఆ ప్రక్రియను సరళీకృతం చేయాలి : సీఎస్ సోమేశ్ కుమార్ - సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
CS Somesh Kumar: సరళతర వాణిజ్య విధానంపై అధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. 12 శాఖల్లో తనిఖీలు, నమోదు, రెన్యువల్స్ రికార్డుల నిర్వహణ సహా ఇతర అంశాల్లో ప్రక్రియను సరళీకృతం చేయాలన్న ఆయన... అవసరం లేని భారాన్ని తగ్గించాలని సూచించారు.
CS Somesh Kumar: సరళతర వాణిజ్య విధానంపై సీఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష
12 శాఖల్లో తనిఖీలు, నమోదు, రెన్యువల్స్ రికార్డుల నిర్వహణ సహా ఇతర అంశాల్లో ప్రక్రియను సరళీకృతం చేయాలన్న ఆయన... అవసరం లేని భారాన్ని తగ్గించాలని సూచించారు. 12 శాఖల్లో 301 సంస్కరణలు అమలవుతున్నాయని... ఈఓడీబీలో అగ్రస్థానాన్ని కొనసాగించాలని అన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ సులువైన విధానాలు అమలు చేయాలని సోమేశ్ కుమార్ అధికారులకు తెలిపారు.
ఇదీ చదవండి: