రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకొనేందుకు బ్యాంకర్లు రుణాలు, అవసరమైన రాయితీలు విరివిగా ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (CS Somesh Kumar) సూచించారు. ఆర్థిక వ్యవస్థ వేగవంతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, బ్యాంకర్లతో సమావేశమైన సీఎస్ సోమేశ్ కుమార్ రిటైలర్స్, షాపింగ్ మాల్స్, టూరిస్ట్ ఆపరేటర్లు, ఆతిథ్యరంగానికి సంబంధించిన ప్రతినిధులతోనూ చర్చించారు.
ఆర్థిక వ్యవస్థ కార్యకలాపాల వేగవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో వివిధ శాఖల అధికారులతో చర్చించారు. వినియోగదారులను ఆకర్షించేలా మరిన్ని రాయితీలు ఇవ్వాలని వ్యాపారులు, వివిధ రంగాల ప్రతినిధులకు సోమేశ్ కుమార్ సూచించారు. కొవిడ్ నిబంధనలను పాటించడంతో పాటు పరిశుభ్రత ఉండేలా చూడాలని వివరించారు. వినియోగదారుల నుంచి కొనుగోళ్లు పెరిగేలా ప్రోత్సహించేందుకు వీలైనన్ని ఎక్కువ రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు.
ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై రుణాలు ఇవ్వండి