తెలంగాణ

telangana

ETV Bharat / state

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో సీఎస్​ సమీక్ష - తెలంగాణ తాజా వార్తలు

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ మంగళవారం సమావేశమయ్యారు. రిజిస్ట్రేషన్‌ శాఖ పున:వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.

స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో సీఎస్​ సమీక్ష
స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులతో సీఎస్​ సమీక్ష

By

Published : Sep 16, 2020, 7:28 AM IST

స్టాంపులు, రిజిస్ట్రేషన్​ శాఖల అధికారులతో సీఎస్​ సోమేశ్​ కుమార్​ సమీక్షించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వారీగా రిజిస్ట్రేషన్ల సంఖ్య, రెవెన్యూ, అక్కడ పని చేస్తున్న సిబ్బంది వివరాలు తదితర అంశాలపై చర్చించారు. ఎక్కడెక్కడ అదనంగా సబ్​రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి వస్తుందని అడిగి తెలుసుకున్నారు.

అయితే స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు నివేదించిన వివరాలతో సంతృప్తి చెందని ఆయన మరింత సమాచారం కావాలని ఆశాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. సమావేశానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ చిరంజీవులు, అదనపు ఐజీ వెంకట రాజేశ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఇదీ చదవండిఃప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాం: వినోద్ కుమార్

ABOUT THE AUTHOR

...view details