స్వైన్‌ఫ్లూ నివారణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్టు హైకోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. త్వరలో హైదరాబాద్ నగరంలో మరో 14 స్వైన్‌ఫ్లూ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని వివరించారు. ఈ నెలలో అందుబాటులోకి వచ్చే కేంద్రాల్లో వ్యాధి నిర్ధరణ యంత్రాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నగరంలో నెలకు 1500 పరీక్షలు నిర్వహించే సామర్ధ్యం ఉన్న మూడు ల్యాబ్‌లున్నాయని కోర్టుకు సమర్పించిన నివేదికలో సీఎస్ పేర్కొన్నారు.
స్వైన్‌ఫ్లూ సాంకేతిక కమిటీ జనవరి 2న సమావేశమైందని.. జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి పలువురిని వ్యాధిపై చైతన్య పరుస్తోందని తెలిపారు. స్వైన్‌ఫ్లూ, డెంగీ జ్వరాలపై నివేదిక సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం అందుకు చేపడుతున్న చర్యలపై నివేదిక సమర్పించింది.