పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని రాష్ట్ర పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా వీధుల్లో చెత్త పేరుకుపోవడం, తరలింపు సరిగా లేకపోవడం వంటి సమస్యలపై ఆయన సోమవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షించారు.
సర్కిళ్ల పరిధిలోని ఈఈ, డీఈ, ఏఎంహెచ్‌ఓ, ఏఎంసీ, ఏసీపీలకు ప్రాంతాలను అప్పగించి, వాటి పరిధిలో 100 శాతం ఫలితాలు తీసుకొచ్చేలా కృషి చేయాలని సూచించారు. జీహెచ్‌ఎంసీకి పారిశుద్ధ్యం ప్రధాన బాధ్యత అని, ఉదయం 6 గంటల్లోపే సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలని సూచించారు.