తెలంగాణ

telangana

By

Published : Dec 3, 2020, 10:43 PM IST

ETV Bharat / state

'నౌకాదళంలో యువతే లక్ష్యంగా ఐఎస్​ఐ హనీ ట్రాప్​'

హనీ ట్రాప్​ను అరికట్టేందుకు రక్షణ దళాల యూనిట్లలో స్మార్ట్ ఫోన్లను నిషేధిస్తున్నట్టు.. తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ చెప్పారు. నౌకాదళంలోని యువతే లక్ష్యంగా హనీ ట్రాప్ జరుగుతోందని వివరించారు.

'నౌకాదళంలో యువతే లక్ష్యంగా ఐఎస్​ఐ హనీ ట్రాప్​'
'నౌకాదళంలో యువతే లక్ష్యంగా ఐఎస్​ఐ హనీ ట్రాప్​'

నౌకాదళంలో కొత్తగా చేరిన యువతే లక్ష్యంగా పాకిస్తాన్​కు చెందిన ఐఎస్ఐ సంస్ధ హనీ ట్రాప్ చేస్తోందని... తూర్పునౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ అన్నారు. హనీ ట్రాప్​లో పడకుండా రక్షణదళాలు ప్రత్యేక చర్యలు చేపట్టాయని వివరించారు. ఫేస్​బుక్​లో నకిలీ ఖాతాలను సృష్టించి.. అమ్మాయిల ఫొటోలతో యువతను ఆకట్టుకుంటున్నారని.. వారి ద్వారా సమాచారం సేకరించేందుకు యత్నిస్తున్నారని అతుల్ కుమార్ తెలిపారు.

ఇంటెలిజెన్స్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, నేవీ పోలీసులు సంయుక్తంగా ఈ తరహా ట్రాప్​లలో భాగస్వాములై సమాచారం అందించేవారిని గుర్తించారని వివరించారు. ఇప్పటికే ఏడుగురుని ఆరెస్ట్ చేసినట్లు తెలిపారు. రక్షణ దళాల యూనిట్లలో స్మార్ట్ ఫోన్లను నిషేధించడమే కాకుండా ఇందులో పనిచేసే వారి సామాజిక మాధ్యమ అకౌంట్లపై నిషేధం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.

'నౌకాదళంలో యువతే లక్ష్యంగా ఐఎస్​ఐ హనీ ట్రాప్​'

ఇదీ చూడండి:వెబ్ కాస్టింగ్ కోసమే బాలుడిని నియమించాం: ఎస్​ఈసీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details