CM KCR Bihar tour: సీఎం కేసీఆర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బిహార్‌కు బయలుదేరారు. ఆ రాష్ట్ర రాజధాని పట్నాకు చేరుకుని అక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరవుతారు. ముఖ్యమంత్రి వెంట సీఎస్ సోమేశ్ కుమార్, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తెరాస ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్ రెడ్డి జాతీయ రైతు సంఘాల నేతలు ఉన్నారు. గల్వాన్ లోయలో మరణించిన అయిదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున పరిహారం ఇస్తారు.
KCR Bihar Tour : సీఎం కేసీఆర్ బిహార్ పర్యటన ప్రారంభం - KCR Bihar Tour
CM KCR Bihar tour: ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి బిహార్ పర్యటనకు బయల్దేరారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలో.. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తో భేటీ అవుతారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, తాజా రాజకీయాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌తో కలిసి చెక్కులను ఆయన అందజేస్తారు. అనంతరం నీతీశ్ నివాసానికి వెళ్లి అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం నీతీశ్ కుమార్, ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లతో సమావేశమవుతారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రంలోని భాజపా ప్రభుత్వ విధానాలు, రాష్ట్రాల పట్ల అనుసరిస్తున్న వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. రాత్రికి ఆయన తిరిగి హైదరాబాద్‌కు వస్తారు.