CM KCR Bihar tour ఈనెల 31న బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన చేయనున్నారు. గాల్వాన్ లోయల్లో మరణించిన సైనికుల కుటుంబాలకు, సికింద్రాబాద్ టింబర్ డిపోలో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించనున్నారు. కేసీఆర్ ఆ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి పాట్నా బయలుదేరి వెళ్తారు. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన బిహార్‌కు చెందిన ఐదుగురు భారత సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం అందిస్తారు. ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థికసాయం అందించనున్నారు. బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌తో కలిసి సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు.
రేపు బిహార్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన - ఎల్లుండి బిహార్‌లో కేసీఆర్ పర్యటన వివరాలు
ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
19:22 August 29
CM KCR Bihar tour ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన
అనంతరం నీతీశ్ కుమార్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమవుతారు. జాతీయ రాజకీయాలపై ఇరువులు సీఎంలు చర్చించనున్నారు. ఇటీవల బిహార్‌లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకోనుంది.
ఇవీ చూడండి:
Last Updated : Aug 30, 2022, 6:42 AM IST