CM KCR visit to Yadadri: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఉద్ఘాటన తేదీ సమీపిస్తుండటంతో పనుల పురోగతిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విశ్వఖ్యాతి చెందేలా పునర్నిర్మితమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం మహాకుంభ సంప్రోక్షణపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఇవాళ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా యాదాద్రి వెళ్తారు. ముగింపు దశలో ఉన్న ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలిస్తారు.
కాసేపట్లో యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ - kcr yadadri tour
15:58 February 06
కాసేపట్లో యాదాద్రి పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్
మహాకుంభ సంప్రోక్షణ కోసం నిర్వహించనున్న సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారు. మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ నిర్వహించనున్నారు. అంతకు ముందు వారం రోజులపాటు మహాసుదర్శన యాగం నిర్వహించనున్నారు. ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలవుతాయి. ప్రస్తుతం ప్రధాన ఆలయ ముఖద్వారం, ధ్వజస్థంభం, బలిపీఠాలకు బంగారు తాపడం పనులు చివరిదశలో ఉన్నాయి. సుదర్శన యాగంలో 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేస్తారు. ఒక్కో యజ్ఞగుండానికి కనీసం ఆరుగురు చొప్పున దాదాపు 6 వేల పైచిలుకు రుత్వికుల పాల్గొంటారు.
దేశ విదేశాల నుంచి యాదాద్రి పున: ప్రారంభ వేడుకలకు వచ్చే అతిథులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు, కోట్లాదిగా తరలివచ్చే జనం కోసం కల్పించే సౌకర్యాలపై కేసీఆర్ దృష్టిసారిస్తారు. అంతర్జాతీయస్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా సాగే పున:ప్రారంభ కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అతిథులు హాజరుకానున్నారు. తన దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఆ మధ్య కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా యాదాద్రి పుణ్యక్షేత్రం మహా కుంభ సంప్రోక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు.
దేశవ్యాప్తంగా ప్రముఖులను, ముఖ్యులను యాదాద్రి పున: ప్రారంభ వేడుకలకు ఆహ్వానిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు, పీఠాధిపతులు, యోగులు, స్వామీజీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మహా కుంభ సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండటంతో అక్కడ యాగశాల నిర్మాణం, ఇతర పనులు, ఏర్పాట్లను సీఎం సమీక్షించనున్నారు.
ఇదీ చదవండి: