ముస్లింలకు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు - ramadan latest updates in telangana
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. లాక్డౌన్ కారణంగా ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.
ముస్లిం సోదరులకు సీఎం శుభాకాంక్షలు
రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లింలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్రమైన ఈ నెల... సమాజంలో సామరస్యం, సంతోషం, సోదరభావ స్ఫూర్తిని మరింతగా పెంపొందిస్తుందని ఆకాంక్షించారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఇళ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలని కేసీఆర్ కోరారు.