ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం బయలుదేరారు. మూడు రోజుల పాటు దిల్లీలో కేసీఆర్ ఉండనున్నారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉంది. అందుబాటులో ఉండే కేంద్రమంత్రులను కలవనున్నారు.
దిల్లీ బయలుదేరిన కేసీఆర్... మూడురోజులు అక్కడే మకాం..! - KCR tour in Delhi
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. అయితే గులాబీ బాస్ అక్కడే మూడురోజులు మకాం వేయనున్నారు.
దిల్లీ బయలుదేరిన కేసీఆర్... మూడురోజులు అక్కడే మకాం..!
కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసే అవకాశముంది. కేంద్రమంత్రులు హర్‌దీప్‌సింగ్ పురి, నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రానికి చెందిన పలు అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి కేసీఆర్ తీసుకెళ్లనున్నారు. దిల్లీలో తెరాస కార్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించనున్నారు.
ఇదీ చూడండి: ఆగని పోరాటం- రైతన్నకు సర్వత్రా మద్దతు