కొత్త సాగు చట్టాలపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క కోరారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుండగా... సీఎం కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నారు. ఆ చట్టాలపై మాట్లడే పరిధి లేదని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్ర విషయాలపై మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క శాసనసభ సమావేశాల నుంచి వాకౌట్ చేశారు.
సభలో భట్టి మాట్లాడుతుండగా.. సీఎం కేసీఆర్ జోక్యం!
శాసనసభలో సీఎల్పీనేత భట్టి విక్రమార్క... సాగు చట్టాలపై మాట్లాడుతుండగా... సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర విషయాలపై మాట్లాడాలని భట్టికి సూచించారు.
Chief Minister kcr interferes while Bhatti is speaking in the assembly sessions 2021