ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. అప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా డిపోల్లో ఎందరు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది చేరారనే సమాచారాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అధికారులు అందజేశారు. కార్మికులకు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో ఈరోజు సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఆర్టీసీ సమ్మె, కార్మికుల చేరికపై ఇవాళ సీఎం కేసీఆర్ సమీక్ష - latest news of cm meet to officers on the issue of tsrtc workers
ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన గడువు ముగియడంతో ఎంతమంది కార్మికులు విధుల్లో చేరారనే వివరాలను ముఖ్యమంత్రికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. అధికారులతో కేసీఆర్ ఇవాళ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.
నేడు ఉన్నతాధికారులతో సీఎం సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రగతి భవన్లో సీఎంను మంగళవారం రాత్రి కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను ఆయనకు వివరించినట్లు తెలిసింది. ఆర్టీసీ బస్సుల నిర్వహణ, ప్రైవేటు బస్సుల పర్మిట్లకు విధివిధానాలు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. ఈ రోజు జరిగే సమావేశంలో చర్చించాల్సిన అంశాలనూ ఖరారు చేసినట్లు తెలిసింది.
ఇదీ చూడండి: ముగిసిన డెడ్‌లైన్... తర్వాత ఏం జరగనుందో..?
Last Updated : Nov 6, 2019, 7:34 AM IST
TAGGED:
ఆర్టీసీ కార్మికులు