Chief Minister KCR left Delhi: ఈ నెల 14వ తేదీన బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి వెళ్లారు. అంతకు ముందు సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. దిల్లీకి చేరుకున్నారు. దిల్లీ విమానాశ్రయంలో కేసీఆర్కు బీఆర్ఎస్ ఎంపీలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 14న బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ భవనం ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో ఆయన దిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది. అదే రోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో పాటు పలువురు జాతీయ నేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు.
దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. రేపు, ఎల్లుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు
16:32 December 12
దిల్లీకి చేరుకున్న సీఎం కేసీఆర్.. రేపు, ఎల్లుండి ప్రత్యేక పూజ కార్యక్రమాలు
మరోవైపు రేపు, ఎల్లుండి దిల్లీ బీఆర్ఎస్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ నిర్వహించే యాగాలు, పూజా కార్యక్రమాలు కోసం పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. రాజశ్యామల యాగం కోసం ప్రత్యేక యాగశాలను నిర్మించిన పార్టీ నేతలు.. యాగశాలలో మూడు హోమ గుండాలు ఏర్పాటుచేశారు. రేపు ఉదయం 9 గంటలకు గణపతి పూజతో యాగం మొదలు పెట్టనున్నారు. ఈ పూజలు కోసం ప్రత్యేకంగా 12మంది రిత్వికులను తీసుకొచ్చారు. వీరు బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు యాగాలు చేయనున్నారు.
పుణ్యావాచనం, యాగశాల సంస్కారం, యాగశాల ప్రవేశం, చండి పారాయణములు, మూల మంత్ర జపములు రిత్వికులు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎల్లుండి నవ చండి హోమము, రాజశ్యామల హోమము.. ఇతర పూజా కార్యక్రమాలు పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుందని తెలిపారు. శృంగేరి పీఠం గోపికృష్ణ శర్మ, ఫణి శశాంక శర్మ ఆధ్వర్యంలో జరగనున్న ఈ యాగాలు బీఆర్ఎస్ విజయవంతం కావడం కోసం.. దేశం సుభిక్షంగా ఉండటానికి దైవకృప కోసం కేసీఆర్ చేస్తున్నట్లు పార్టీలోని ముఖ్యనేతలు తెలిపారు.
ఇవీ చదవండి: