తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ విందు.. వారికి అటువైపు బందు! - Latest news aboutKCR

Chief Minister KCR Christmas dinner at LB Stadium: క్రిస్మస్​కి ముందుగా క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ విందు ఏర్పాటు చేయనున్నారు. దీంతో అటువైపు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ పోలీస్​లు నిబంధనలు, సూచనలు చేశారు.

Chief Minister KCR Christmas dinner
ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ విందు

By

Published : Dec 20, 2022, 4:51 PM IST

Chief Minister KCR Christmas dinner at LB Stadium: రేపు ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్రిస్మస్ విందు ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.

  • పబ్లిక్ గార్డెన్ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు నాంపల్లి, చాపల్ రోడ్ వైపు మళ్లింపు
  • అబిడ్స్ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు ఎస్బీఐ, గన్ ఫౌండ్రి, నాంపల్లి రైల్వే స్టేషన్ మీదుగా మళ్లింపు
  • బషీర్​బాగ్ నుంచి నిజాం కళాశాల వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మీదుగా మళ్లింపు

ఆంక్షల సమయంలో వాహనదారులు పోలీస్ కంట్రోల్ రూమ్, బషీర్​బాగ్​, గన్ ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, పబ్లిక్ గార్డెన్స్, రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్, ఎంజే మార్కెట్, హైదర్ గూడ కూడళ్ల వైపు రావొద్దని సూచించారు. ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వారికి ముందస్తుగా పాస్​లు జారీ చేసినట్టు ట్రాఫిక్ పోలీసు​లు వివరించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details