రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ (Prc) తదితర డిమాండ్లు అన్నింటికి పెద్ద మనసుతో ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr)కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) తోటి మంత్రి వర్గ సభ్యులకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 30% ఫిట్మెంట్ తో పాటు ఇతర పీఆర్సీ జీవోలు విడుదలకు ఆమోదం తెలిపినందున తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఔట్‌సోర్సింగ్, ఇతరత్రా ఉద్యోగులందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
PRC: పీఆర్సీకి ఆమోదం... సీఎంకు మంత్రి కృతజ్ఞతలు - Minister srinivas goud news
ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ (Prc) తదితర డిమాండ్లకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr)కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గెజిటెడ్, ఉద్యోగ, ఉపాధ్యాయ, ఔట్‌సోర్సింగ్, ఇతరత్రా ఉద్యోగులందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
srinivas goud
అలాగే గ్రూప్ 1, 2 ఉద్యోగులతో పాటు మరిన్ని ఖాళీలను కూడా ముఖ్యమంత్రి భర్తీ చేస్తారని శ్రీనివాస్ గౌడ్ (Srinivas goud) స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగస్వాములై మరింత ఉత్సాహంతో ప్రతిరోజూ గంట అదనంగా పనిచేసేందుకు సంసిద్ధతను వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా... టీజీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్, మమతను అధికారులు ఘనంగా సన్మానించారు.