హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీకి బయలుదేరారు. సీఎంతోపాటు ఎంపీలు కేకే, నామా, సంతోష్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దిల్లీ వెళ్లారు. రెండు రోజుల పాటు దిల్లీలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.
దిల్లీకి కేసీఆర్... ఇవాళ మోదీతో భేటీ - Chief Minister goes to Delhi KCR_telangana
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి దిల్లీ వెళ్లారు. రెండురోజుల పర్యటన నిమిత్తం ప్రధానితో పలు కీలక అంశాలను చర్చించనున్నారు.
దిల్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి కేసీఆర్
Last Updated : Oct 3, 2019, 11:54 PM IST