జగన్‌కు సీఈసీ షాక్.. శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నిక చెల్లదని ఆదేశాలు - Central election commission latest news
18:26 September 21
వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్ ఎన్నిక చెల్లదు: సీఈసీ
Cec on jagan elecion on ycp perminent president ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షాక్ ఇచ్చింది. వైకాపా శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకీ శాశ్వత అధ్యక్షుడు గానీ, శాశ్వత పదవులు గానీ వర్తించవని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. ఈ ఆదేశాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డికి పంపినట్టు ఈసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
వైకాపాకు శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైనట్టుగా వచ్చిన వార్తలు, మీడియాలో చూసిన కథనాల ఆధారంగా ఈసీ స్పందించింది. ‘‘ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి అయినా తరచూ ఎన్నికలు జరగాలి. శాశ్వత అధ్యక్షుడు, శాశ్వత పదవులు ప్రజాస్వామ్య వ్యతిరేకం. అనేకసార్లు లేఖ రాసినా వైకాపా పట్టించుకోలేదు. వెంటనే అంతర్గత విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి’’ అని వైకాపా ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది.
ఇవీ చూడండి: