మోదీ సర్కారు విధానాలతో దేశం తిరోగమన స్థితిలో ఉందన్నారు మాజీ కేంద్ర మంత్రి చిదంబరం. సంస్కరణ పేరుతో రాష్ట్రాలకిచ్చే నిధుల్లో కోత విధించడాన్ని ఆయన తప్పుపట్టారు. దీనిపై ముఖ్యమంత్రులు పోరాడాలని ఆయన సూచించారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ పరిశోధన విభాగం ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ 2020-21 పై జరిగిన సదస్సులో చిదంబరం పాల్గొని అనంతరం ఆర్థిక పరిస్థితులపై పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
'కేంద్రంతో మీరు విభేదిస్తున్నారా.. కలిసిపోతున్నారా...?' - తెలంగాణ
రాష్ట్రాల పురోగతికి కేంద్రం విధానాలు అడ్డంకిగా మారాయని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం అభిప్రాయపడ్డారు. పలు సంస్కరణల సాకుతో.. రాష్ట్రాలకిచ్చే నిధుల్లో కోత విధించడాన్ని ఆయన తప్పుపట్టారు.
కేంద్రంతో కేసీఆర్ సంబంధాలపై చిదంబరం వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంతో కొన్నిసార్లు కలిసిపోతూ.. మరికొన్ని సార్లు విభేదిస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని కేసీఆర్ ప్రశ్నించాలని సూచించారు.
ఇవీ చూడండి:దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది: చిదంబరం