తెలంగాణ

telangana

ETV Bharat / state

వ్యర్థాలు పారవేయొద్దన్నందుకు జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడి

జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. చికెన్‌ వ్యర్థాలు పార వేయొద్దని చెప్పినందుకు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఎల్లమ్మబండలో జరిగింది.

By

Published : May 3, 2021, 1:52 PM IST

chicken retailer attack on ghmc employees
కూకట్‌పల్లిలోజీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడి

హైదరాబాద్‌ కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో కొందరు చికెన్‌ వ్యాపారులు వ్యర్థాలు పారవేయొద్దని చెప్పినందుకు పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేశారు. చికెన్ వ్యాపారం నిర్వహించే గోపి... వ్యర్థాలను ఎల్లమ్మబండ కూడలి వద్ద పార వేస్తుండగా పారిశుద్ధ్య విభాగం ఎస్‌ఎఫ్ఏ వీరారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే అధికారులకు చికెన్ వ్యాపారికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చికెన్ వ్యాపారి తన అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి చేశారు.

సిబ్బంది నిరసన:

జీహెచ్‌ఎంసీ సిబ్బందిపై దాడికి నిరసనగా ఆ వ్యక్తి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి ఇంటి ముందు చెత్త వేసి నిరసన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆల్విన్ కాలనీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ మద్దతు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తి ఇంటి వద్దకు చేరుకుని బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు. మరోసారి తమపై దాడులు చేస్తే విధులను నిలిపివేసి రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు

ఇదీ చూడండి:45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే కరోనా టీకాలు: డీహెచ్​

ABOUT THE AUTHOR

...view details