కరోనా రెండో దశ కేసులు విజృంభిస్తున్న తరుణంలో బేగంపేటకు చెందిన తెరాస యువజన విభాగం నాయకుడు నరసింహ ఆహారాన్ని అందించారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట ఉన్న రోగుల సంరక్షకులకు నరసింహ చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. దాదాపు 100 మందికిపైగా బిర్యాని పొట్లాలను అందించారు.
గాంధీ ఆస్పత్రిలోని కరోనా సంరక్షకులకు చికెన్ బిర్యానీ పంపిణీ - Telangana news
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి ఎదుట ఉన్న రోగుల సంరక్షకులకు తెరాస యువజన విభాగం నాయకుడు నరసింహ చికెన్ బిర్యానీ పంపిణీ చేశారు. సామాజిక సేవలో తన వంతు సహకారాన్ని అందిస్తూ ఆకలితో ఉన్న వారి ఆకలిని తీరుస్తున్నారు.

Chicken Biryani distributed at Gandhi Hospital
గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా బాధితుల కుటుంబ సభ్యులు పడుతున్న బాధలను చూసి వారికి ఆహారాన్ని అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. లాక్ డౌన్ ఉన్నన్ని రోజులు వారికి ఆహారాన్ని అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: వైద్యులకు రక్షణ కల్పించాలని మోదీకి ఐఎంఏ లేఖ!