ఆత్మరక్షణ కోసమే పోలీసులు కాల్పులు జరపారని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఒక లా మేకర్‌గా ఎన్‌కౌంటర్‌ను సమర్థించనని స్పష్టం చేశారు.
'వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారు' - ఎంపీ రంజిత్‌రెడ్డి
నిందితులు దాడికి యత్నించడం వల్లే పోలీసులు కాల్పులు జరపారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మ శాంతిస్తుందని భావించారు.
చేవెళ్ల ఎంపీ రేవంత్‌రెడ్డి
సీన్ రిపీట్ చేస్తున్నప్పుడు నిందితులు పోలీసులను బెదిరించి పారిపోయే ప్రయత్నం చేయడంతోనే పోలీసులు కాల్పులు జరిపారని వెల్లడించారు. వారు తీసుకున్న గోతిలో వారే పడ్డారన్నారు.
ఎన్‌కౌంటరే ప్రతి ఘటనకు తీర్పు అనుకోనని ఎంపీ స్పష్టం చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌ను నిర్భయ తల్లి స్వాగతించారని వెల్లడించారు. ఈ ఘటనతో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు.
- ఇదీ చూడండి : తెలంగాణ పోలీసులపై పూల వర్షం
Last Updated : Dec 6, 2019, 2:17 PM IST