హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పత్రాలు ఇవ్వలేదన్న కేంద్ర ప్రభుత్వం వాదనను తప్పుబట్టారు. లోక్ సభలో 377 నిబంధన ప్రకారం ఐటీఐఆర్ అంశాన్ని ప్రస్తావించారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి కేటీఆర్ వివరణాత్మక మెమోరాండంను పంపించారని వివరించారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై గొంతెత్తిన తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి - ఐటీఐఆర్ వార్తలు
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు. 377 నిబంధన ప్రకారం ప్రత్యేకంగా ఐటీఐఆర్ అంశాన్ని లేవనెత్తారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానికి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.
![ఐటీఐఆర్ ప్రాజెక్టుపై గొంతెత్తిన తెరాస ఎంపీ రంజిత్ రెడ్డి chevella mp rajnith reddy discuss on itir in loksabha in delhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10926948-617-10926948-1615221066609.jpg)
ఐటీఐఆర్ ప్రాజెక్టుపై గొంతెత్తిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి
ఐటీఐఆర్‌కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించారని తెలిపారు. గడిచిన 6 ఏళ్లలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖతో సంప్రదింపులు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో ఐటీఐఆర్‌కు నిధులు కేటాయించాలని కోరిన విషయాన్ని రంజిత్ రెడ్డి ప్రస్తావించారు. ఐటీఐఆర్ విషయంలో తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని..... కేంద్రం వెంటనే ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆమోదించి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.